ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ టీకా వేయించుకున్న జాయింట్ కలెక్టర్ - కొవిడ్ టీకా తీసుకున్న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ న్యూస్

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోవటంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలను కోరారు.

Krishna District Joint Collector of covid Vaccinated
కొవిడ్ టీకా వేయించుకున్న జాయింట్ కలెక్టర్

By

Published : Feb 19, 2021, 5:15 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలోని నూతన ప్రభుత్వాసుపత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. టీకా​ను షెడ్యూల్ ప్రకారం గురువారం తీసుకోవాల్సి ఉన్నా.. కొన్ని పనుల కారణంగా మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్య శాఖ సిబ్బంది భయపడకుండా కొవిడ్ టీకాను వేయించుకోవాలని సూచించారు.

షెడ్యూల్ ప్రకారం ఎవరైనా వ్యాక్సినేషన్​కు రాలేకపోతే స్లాట్​ను మార్చుకునే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. టీకా తీసుకోవటంపై సిబ్బంది ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని హితవు పలికారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యం తలెత్తినవారు ఒక శాతం లోపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details