కృష్ణా జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో.. జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డ, మోపిదేవి మండలంలో కొవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించారు. సెంటర్లలో సరిపడా సిబ్బంది లేకపోవటంతో దగ్గర్లో ఉన్న పీహెచ్సీ , పారా మెడికల్ సిబ్బందిని పిలిపించాలని అధికారులకు సూచించారు. కూచిపూడిలోని సిలికానాంధ్ర వైద్యాలయాన్ని సందర్శించి.. అక్కడ బాధితులకు అందుతున్న ఆక్సిజన్ సరఫరా గురించి ఆరా తీశారు. ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆక్సిజన్ ప్లాంట్ల యజమానులకు సూచించారు. జిల్లాలో మొత్తం 77 ఆసుపత్రుల్లో.. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు జేసి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5117 బెడ్లు ఉన్నాయని.. అదనంగా 7 వేల మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వివరించారు. అనంతరం మచిలీపట్నంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను జేసీ పరిశీలించారు.
కొవిడ్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జేసీ శివశంకర్ - విజయవాడలో కొవిడ్ కేర్ సెంటర్లలో జేసీ తనీఖీలు
కృష్ణా జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో.. జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రుల్లో బాధితులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ అవసరమైన ఆస్పత్రులకు సరఫరా చేయాలని ఆక్సిజన్ ప్లాంట్ల యజమానులకు సూచించారు.
![కొవిడ్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జేసీ శివశంకర్ jc shiva shankar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:50:27:1621869627-vlcsnap-2021-05-24-20h49m40s816-2405newsroom-1621869604-537.jpg)
jc shiva shankar