విజయవాడలో పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు గోదావరి నీటి విడుదల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. నీటి లభ్యత- ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఏయే కాలువలకు ఎప్పటి నుంచి సాగుకునీరు అందేంచాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం మూడు పంపులను ప్రారంభించి 1500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రైవస్ కాలువకు తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు బ్యారేజీ వద్దకు చేరిన వెంటనే మిగిలిన కాలువలకు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు.