తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కృష్ణా జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులకు విజయవాడలో శిక్షణ ఇస్తున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి దశ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో.. 30 సమస్యాత్మక పంచాయతీలున్నట్లు గుర్తించామని జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు - పంచాయతీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులకు విజయవాడలో శిక్షణ
శుక్రవారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ, జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులకు విజయవాడలో శిక్షణ ఇస్తున్నారు.
విజయవాడలో శిక్షణ తీసుకుంటున్న రిటర్నింగ్ అధికారులు