కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు విజయవాడలో మంగళవారం నిరసన చేశారు. బదిలీలు, పదోన్నతులలో ఛైర్మన్ అవకతవకలకు పాల్పడ్డారని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే పట్టించుకోవడం లేదని, ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సహకార బ్యాంకులో బయట వ్యక్తులు చేరి డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
సహకార బ్యాంకు ఛైర్మన్ తీరుపై ఉద్యోగుల నిరసన - కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఉద్యోగుల ధర్నా
కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులలో అవకతవకలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అసోసియేషన్ విజయవాడలో నిరసన చేపట్టింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి రాంబాబు ఆరోపించారు. మహిళలు, దివ్యాంగ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖాతాదారులు, ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తూ...మహిళలు, దివ్యాంగ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. కరోనా సమయంలో ఏ విధంగా బదిలీ చేస్తారు.. సీఎం బదిలీ చేయమని ఆదేశించారా అని ప్రశ్నించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల సమస్యలను మండలిలో లేవనెత్తుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :ఏపీ పోలీస్ శాఖకు జాతీయ పురస్కారం