ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందికి.. కలెక్టర్​ షోకాజ్ నోటీసులు - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందికి కలెక్టర్ ఇంతియాజ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులకు రాని వారిపై చట్టప్రకారం క్రమశిక్షణా చర్యలకు తీసుకున్నారు.

collector imtiyaz action on poling staff who were absent for duties
ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందికి.. కలెక్టర్​ షోకాజ్ నోటీసులు

By

Published : Feb 24, 2021, 4:12 AM IST

కృష్ణా జిల్లాలో తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై కలెక్టర్ ఇంతియాజ్ చర్యలు చేపట్టారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ లుగా ఎన్నికల విధుల నిర్వహణకు ఆర్డర్ కాపీలు తీసుకున్న పోలింగ్ సిబ్బంది కొందరు విధులకు హాజరుకాలేదు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.

గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్​ నోటీసు

మొదటి విడత ఎన్నికల్లో 297 మంది, రెండో విడత ఎన్నికలకు 354 మంది , 3వ విడత ఎన్నికల్లో 223 మంది, నాల్గో విడతలో 295 మంది సిబ్బంది విధులకు హాజరుకాలేదని గుర్తించారు. వీరందరికి కలెక్టర్ ఇంతియాజ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

'దుర్గగుడి స్కాంలో... మంత్రి వెల్లంపల్లి‌, ఈవో సురేష్‌బాబులే అసలు దోషులు'

ABOUT THE AUTHOR

...view details