కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల పరిధిలో నాలుగు నుంచి ఐదు శాశ్వత వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాలలో వీటి ఏర్పాటుపై ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, ఆడిటోరియంలలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వాక్సినేషన్ కేంద్రాల వద్ద కొవీషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా వివరాలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు.. గుర్తించిన శాశ్వత వాక్సినేషన్ కేంద్రాల వివరాలను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టర్‌కు నివేదిక అందించాలన్నారు. వాటిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా భద్రతా కార్యదర్శి విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వాహనంలో కూర్చునే టీకా.. ఎక్కడంటే?
మూడు రకాల టోకెన్లు...
కొవిడ్ బాధితులను రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 వర్గాలుగా గుర్తించి వాక్సినేషన్ చేపడతామని కలెక్టర్ తెలిపారు. 'రెడ్ టోకెన్' ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, 'గ్రీన్ టోకెన్' 60 ఏళ్లు నిండిన వయో వృద్ధులకు, 'బ్లూ టోకెన్' 45 ఏళ్లు దాటిన రోగులకు జారీ చేయాలన్నారు. ఆయా కేంద్రాల పరిధిలో టీకాల డిమాండ్‌కు తగినట్లుగా టోకెన్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఓ రిజిస్టరు నిర్వహిస్తూ.. వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వాటిని అందించాలన్నారు. సచివాలయాల స్టాంపుతో పాటు ఒక రోజు ముందు మాత్రమే వాటిని బాధితులకు ఇవ్వాలన్నారు. ఫ్రంట్ల్లైన్ వర్కర్స్కు సంబంధిత శాఖాధికారులు టోకెన్లు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు.