విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్య లైంగికంగా వేధిస్తున్నారంటూ డీటీపీ ఆపరేటర్ పని చేస్తున్న మహిళ దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు కలెక్టర్ ఇంతియాజ్ కమిటీని నియమించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ , ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరక్టర్ కమిటీ సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. నాంచారయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.
సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
దిశ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారించేందుకు ఆసుపత్రికి వెళ్లగా సూపరింటెండెంట్ అక్కడ లేకపోవటంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారని సమాచారం. వేధింపులకు సంబంధించిన ఆడియో టేపులను బాధితురాలు ఇప్పటికే పోలీసులకు అందించారు.
ఇదీ చదవండి : 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ