ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు...కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి - vijayawada latest news

విజయవాడ దుర్గ గుడి(vijayawada durga temple)లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, నగర సీపీ పరిశీలించారు. కరోనా నిబంధనల(corona precautions)కు అనుగుణంగా రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన

By

Published : Oct 5, 2021, 4:56 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి(vijayawada indrakeeladri)పై దసరా ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. శనీశ్వరాలయం నుంచి మహామండపం వరకు క్యూలైన్లు, స్నానపు ఘాట్​లను పరిశీలించారు. ఉత్సవాల్లో (dussehra festival) కరోనా నిబంధనలకు అనుగుణంగా రోజుకు పది వేల మంది భక్తులకు టైం-స్లాట్(time slat) ప్రకారం అనుమతిస్తామన్నారు.

ఉత్సవాలలో హెలిప్యాడ్ రైడ్(heli pad ride)​ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బందోబస్తులో భాగంగా.. నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశామని, కరోనా కారణంగా అన్నదాన కార్యక్రమం లేనందున, భక్తులకు ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదం అందజేయనున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. మూల నక్షత్రం రోజు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన

ఉత్సవాల్లో రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నాం. భక్తులకు కరోనా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తాం. పర్యాటకుల కోసం హెలీరైడ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా విజయవాడ నగరాన్ని ఆకాశమార్గంలో చూసే అవకాశం ఉంటుంది. -నివాస్, కృష్ణా జిల్లా కలెక్టర్

జల్లు స్నానాలు, కేశ ఖండనాలకు అనుమతిచ్చాం. ఇరుముడి, హోమగుండాలు ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. ఆఫ్​లైన్, ఆన్​లైన్​లో దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. పటిష్ఠ బందోబస్తు కోసం 2,500 మంది సిబ్బందిని నియమించాం. అన్నప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తాం. -బత్తిన శ్రీనివాసులు, విజయవాడ సీపీ

ఏడో తేదీ నుంచి 15 వరకు...

అక్టోబరు ఏడో తేదీ నుంచి 15 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని(permission) ఆలయ అధికారులు నిర్ణయించారు. రోజుకు పది వేల మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. అందులో నాలుగు వేల మంది భక్తులకు ఉచితంగా... వంద రూపాయలు, మూడు వందల రూపాయల టిక్కెట్‌ల ద్వారా మూడు వేల మందికి దర్శనం కల్పించున్నారు. భక్తులు ఎవరైనా ముందుగా ఆన్‌లైన్‌ టిక్కెట్లు(online tickets) పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి కరోనా టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని భక్తులు తమవెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

నదీ స్నానాలు రద్దు..

నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు లిఫ్ట్​ సౌకర్యాన్ని నిలిపివేయనున్నారు. భక్తుల కోసం వినాయకగుడి నుంచి టోల్‌గేట్‌ ద్వారా కొండపైన ఓం మలుపు వరకు మూడు వరుసల మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం నుంచి దిగువకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వరుసల్లో శానిటైజేషన్‌, థర్మల్‌గన్స్‌తో తనిఖీలు చేయాలని సూచించారు. కృష్ణానదిలో స్నానాలను నిషేధించారు. భక్తులు జల్లుస్నానాలు చేసుకునేందుకు వీలుగా సీతమ్మ వారి పాదాల వద్ద మూడు వందల షవర్లు ఏర్పాటు చేయనున్నారు. దుర్గాఘాట్‌ నుంచి భక్తులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.

ప్రత్యేక పూజల రుసుము..

ఉత్సవాల అన్ని రోజులలో లక్ష కుంకుమార్చన చేయాలని... మూలానక్షత్రం రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు కుంకుమార్చనకు మూడు వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున టిక్కెట్‌ ధర ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. అన్ని రోజులలో ప్రత్యేక చండీహోమం జరపాలని, ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు నాలుగు వేల రూపాయలుగా టిక్కెట్‌ రుసుము నిర్ణయించారు. చక్రనవావర్చనలో పాల్గొనే వారు మూడు వేల రూపాయలు సేవా రుసుము చెల్లించాలని.. ఈ టిక్కెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందాలని సూచించారు.

10 లక్షల లడ్డూలు..

భక్తులకు విక్రయించేందుకు ఈ తొమ్మిది రోజులకు మొత్తం 10 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. వివిధ దేవాలయాల నుంచి 200 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 11న అర్చక సభ.. అక్టోబరు 13న వేద సభ నిర్వహించనున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details