ఒకప్పుడు కరోనా కేసులు అత్యధికంగా నమోదైన కృష్ణాజిల్లాలో నేడు గణనీయంగా తగ్గాయి. అత్యధిక నిర్ధరణ పరీక్షలు, భౌతికదూరం పాటించటం, మాస్క్ ధరించటం, అవగాహన కార్యక్రమాలు చేయటం వలన పాజిటివ్ కేసులు తగ్గాయని అధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం నాలుగు వేల కరోనా నిర్ధరణ పరీక్షలు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారితో ఆశావర్కర్లు, స్థానిక పీహెచ్సీ కేంద్రాల నుంచి వైద్యులు సంప్రదించి కరోనా చికిత్స అందిస్తున్నామని జిల్లా కలెక్టర్‌తో ఇంతియాజ్ అంటున్నారు.
ట్రిపుల్ టీ తోనే కరోనా పాజిటివిటీ రేటు కట్టడి : కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా జిల్లా కరోనా కేసులు
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడం వల్లే కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. మరణాల సంఖ్య కూడా రాష్ట్ర సగటుతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. జిల్లాలో హర్డ్ ఇమ్యూనిటీకి అవకాశాలున్నాయని అంటున్న ఇంతియాజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

కలెక్టర్ ఇంతియాజ్
Last Updated : Aug 29, 2020, 6:56 AM IST