ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

krishna godavari: 'గెజిట్‌ పై మా అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం'

జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్ల నేతృత్వంలో జరిగిన భేటీకి ఇరు బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు, ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి, ఈఎన్​సీ, ఇంజినీర్లు హాజరయ్యారు.

ముగిసిన కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం
ముగిసిన కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

By

Published : Aug 9, 2021, 3:23 PM IST

Updated : Aug 9, 2021, 4:27 PM IST

జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్టుల సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్ల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు హాజరయ్యారు. రెండు బోర్డుల సమావేశానికి తెలంగాణ గైర్హాజరైంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ వెల్లడించింది.

అభ్యంతరాలు లేని ప్రాజెక్టు వివరాలైతే ఇస్తామని.. వివరాల సమర్పణకు వారం గడువు కావాలని.. ఏపీ కోరింది. ఈ మేరకు బోర్డుల ఛైర్మన్లు స్పందిస్తూ.. తాము కోరిన సమాచారం ఇవ్వాలన్నారు. నెలలో గెజిట్‌ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని, ఈ విషయంపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ భద్రతపై కేంద్రంతో చర్చిస్తున్నామని జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ,జల్‌శక్తి శాఖతో చర్చిస్తోందని బోర్డులు తెలిపాయి.

Last Updated : Aug 9, 2021, 4:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details