Villagers Complaint to SP and Collector: ఎమ్మెల్యే వంశీ అనుచరులపై జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి నాగ వెంకట సాయి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వంశీ అనుచరులు వచ్చి తాము ఇంటిలిజెన్స్ పోలీసులు అని చెప్పి బెదిరించినట్లు లేఖలో ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిగిన సంఘటనపై దర్యాప్తు జరపాలని హనుమాన్ జంక్షన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి రోజాకు, జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు రామిశెట్టి ఉమామహేశ్వరరావు పంపారు. ఇటీవల వంశీ వ్యతిరేక వర్గం ఇంచార్జి ని నియమించాలని కోరుతూ ఛలో తాడేపల్లి బైక్ ర్యాలీ చేపడ్డంతో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే అనుచరులపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు.. - Kothapalli Villagers Complaint to SP and Collector against on MLA Vamsi followers
Villagers Complaint to SP and Collector: ఎమ్మెల్యే వంశీ అనుచరులపై జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి నాగ వెంకట సాయి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే అనుచరులపై ఎస్పీ,కలెక్టర్ కు ఫిర్యాదు....