బ్రాహ్మణ కార్పొరేషన్‌కు బడ్జెట్లో సీఎం జగన్ 200కోట్లు కేటాయించారని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. దేవాదాయ శాఖ బడ్జెట్లోనే ఈ నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. ఈ సారి కార్పేరేషన్‌కు నిధులు పెంచాలని సీఎంను కోరగా... ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వల్ల బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారని... వారందరికీ సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం...
గత ఏడాది బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100కోట్లు నిధులు కేటాయించగా. . ఈ ఏడాది రెట్టింపు చేసి 200 కోట్లు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారని... బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. జూలై నుంచి రాష్ట్రంలోని 22 వేల పేద బ్రాహ్మణులకు నెలకు 2,500 రూపాయలు చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:'తెదేపా నేతలపై పెట్టేవి అక్రమ కేసులే... ఇదిగో సాక్ష్యం'