ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేవంత్, శ్రీధర్ ఎవరైనా ఓకే.. పోటీలో మాత్రం నేనున్నా: కోమటిరెడ్డి - Telangana congress latest news

తెలంగాణ పీపీసీ పదవికి ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజీనామా చేయగా... ఇప్పడు ఆ స్థానానికి ఎవరు అర్హులనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తానూ రేసులో ఉన్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. పదవి ఎవ్వరికిచ్చినా.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

tpcc new president
రేవంత్, శ్రీధర్ ఎవరైనా ఓకే.. పోటీలో మాత్రం నేనున్నా: కోమటిరెడ్డి

By

Published : Dec 5, 2020, 6:49 PM IST

తెలంగాణ పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనకు కాకుండా... శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలో ఎవరికి పీసీసీ ఇచ్చినా కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీని పటిష్ఠం చేసేలా ముగ్గురం కలిసి పని చేస్తామని కోమటిరెడ్డి వివరించారు.

ముగ్గురిలో ఒకరికి...!

టీపీసీసీ పదవికి ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజీనామా చేయగా... ఇప్పుడు ఆ స్థానం ఎవరికి దక్కనుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిణామాల్లో పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్​, రేవంత్​రెడ్డి, శ్రీధర్​బాబు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి పీసీసీ పదవి ఇచ్చి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం

ఇదీ చూడండి:

పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషి: మంత్రి అవంతి

ABOUT THE AUTHOR

...view details