ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మునుగోడు సభ వేదికగా భాజపా తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి - munugode by elections

Rajagopal reddy BJP Joining తెలంగాణలోని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడులో నిర్వహించిన భాజపా సమరభేరి వేదికగా రాజగోపాల్​రెడ్డికి పార్టీ కండుపా కప్పి కేంద్ర మంత్రి అమిత్​ షా పార్టీలోకి ఆహ్వానించారు.

మునుగోడు సభ వేదికగా భాజపా తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి
మునుగోడు సభ వేదికగా భాజపా తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

By

Published : Aug 21, 2022, 9:49 PM IST

Rajagopal reddy BJP Joining: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మునుగోడు భాజపా సమరభేరి వేదికగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్​ షా హాజరై.. రాజగోపాల్​రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించారు. రాజగోపాల్​రెడ్డికి స్వయంగా కాషాయ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. దేశ, రాష్ట్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేదన్న రాజగోపాల్​ రెడ్డి.. తాను చేస్తున్న ఈ యుద్ధంలో సైనికుల్లా పోరాడి సంచలన విజయం చేకూర్చాలని జనాలకు విజ్ఞప్తి చేశారు.

"కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించాలి. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి నేను వెళ్లట్లేదు. రాజీనామా చేసి నిజాయతీగా ప్రజల తీర్పు కోరుతున్నా. కేసీఆర్‌ వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా. ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదు. నా రాజీనామా తర్వాతే కేసీఆర్‌ నిద్ర లేచారు. నా రాజీనామాతో గట్టుప్పల్‌ మండలం, పింఛన్లు వచ్చాయి. 2018లో చెప్పిన 57 ఏళ్ల వారికి ఫించను ఇప్పుడు ఇస్తున్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యం. మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం అక్రమసొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు. కేసీఆర్‌ అక్రమాలు చేశారు కాబట్టే ఈడీ, మోడీకి భయపడుతున్నారు."- కోమటిరెడ్డి రాజగోపాల్‌, భాజపా నేత

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details