ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

kollu ravindra: 'నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే..'

నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే వాళ్లను బలవంతంగా అరెస్టు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా నిరుద్యోగులు తాడేపల్లికి చేరుకున్నారంటే వారి కడుపుమంట ఎలా ఉందో గ్రహించాలని హితవు పలికారు.

కొల్లు రవీంద్ర
కొల్లు రవీంద్ర

By

Published : Jul 19, 2021, 5:00 PM IST

Updated : Jul 19, 2021, 5:44 PM IST

మాట తప్పను మడమ తిప్పను అన్న వైఎస్​ జగన్.. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా నిరుద్యోగులు తాడేపల్లికి చేరుకున్నారంటే వారి కడుపుమంట ఎలా ఉందో గ్రహించాలని హితవు పలికారు.

నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే విద్యార్థుల అరెస్టులు

'తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు నిలుపునివ్వడంతో ముఖ్యమంత్రి జగన్ పిరికి పందలా ఇంటి చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టుకున్నారు. సమాధానం చెప్పలేకే నిరుద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2.30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిన సీఎం జగన్​.. ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వాళ్లు తీవ్ర అందోళనలో ఉన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.3 లక్షల ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలి' అని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

Last Updated : Jul 19, 2021, 5:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details