ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బలహీనవర్గాలపై దాడులు చేస్తూ... అరాచకాలు సృష్టిస్తున్నారు' - 'బలహీనవర్గాలపై దాడులు చేస్తూ...అరాచకాలు సృష్టిస్తున్నారు'

మహానాడు స్పూర్తితో వైకాపా ప్రభుత్వంపై పోరాడి బీసీల హక్కులను సాధిస్తామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బలహీన వర్గాల సంక్షేమం, నిధుల కేటాయింపులోనూ జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

'బలహీనవర్గాలపై దాడులు చేస్తూ...అరాచకాలు సృష్టిస్తున్నారు'
'బలహీనవర్గాలపై దాడులు చేస్తూ...అరాచకాలు సృష్టిస్తున్నారు'

By

Published : May 29, 2020, 10:44 PM IST

బలహీన వర్గాల సంక్షేమం, నిధుల కేటాయింపులోనూ జగన్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బలహీనవర్గాలపై దాడులు చేస్తూ... అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో, నిధుల కేటాయింపుల్లో జగన్ బీసీలను నయవంచనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలకు ఆసరాగా ఉండే పథకాలను రద్దు చేసుకుంటూ వెళ్తున్నారని ధ్వజమెత్తారు.

మహానాడు స్పూర్తితో వైకాపా ప్రభుత్వంపై పోరాడి బీసీల హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. మహానాడులో తెదేపా తీసుకున్న నిర్ణయాలు బలహీన వర్గాలకు నూతన ఉత్తేజాన్ని, భరోసా కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే కాలంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం కలిగించే విధంగా మహానాడులో నిర్ణయాలు తీసుకున్నందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ తర్వాతే బీసీలకు రాజకీయంగా, సామాజికంగా చైతన్యం కలిగిందని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో బలహీన వర్గాలు ముందుకు వెళతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details