ముఖ్యమంత్రి జగన్ ఇంటిని ముట్టడిస్తారనే భయంతోనే అమరావతి ఐకాస నేతల గృహనిర్భందం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల్లో చెక్‌పోస్టులు పెట్టి ప్రజల్ని, అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. రైతులంటే ప్రభుత్వానికెందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. 550 రోజులుగా సాగుతున్న అమరావతి రైతుల ఉద్యమం..చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
'సీఎం పదవికి రాజీనామా చేయండి'
ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడలేకపోతే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి డిమండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంలో 5 కోట్ల మందిని వంచించిన సీఎం జగన్ ఇప్పటికైనా మౌనం వీడాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.