ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rahulu Murder: 'రాహుల్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు' - రాహుల్ హత్య వార్తలు

వ్యాపారి రాహుల్‌ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని రౌడీషీటర్ కోగంటి సత్యం అన్నారు. ఈ కేసులో పోలీసు విచారణకు సహకరిస్తానన్నారు.

రాహుల్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు
రాహుల్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు

By

Published : Aug 20, 2021, 3:58 PM IST

Updated : Aug 20, 2021, 4:57 PM IST

విజయవాడలో సంచలనం రేపిన వ్యాపారి రాహుల్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం స్పందించారు. రాహుల్​ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసులో పోలీసు విచారణకు సహకరిస్తానన్నారు. రాహుల్‌కు, కోరాడ విజయ్‌కుమార్‌కు వ్యాపారలావాదేవీలు ఉన్నాయని సత్యం వెల్లడించారు. రాహుల్​తో సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్నట్లు తనతో విజయ్‌కుమార్‌ చెప్పినట్లు సత్యం తెలిపారు. ఆ వివాదమే హత్యకు దారితీసి ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. కోరాడ విజయ్‌కుమార్‌ కుటుంబానికి, తమ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

సత్యమే నిందితుడని ప్రాథమిక నిర్ధరణ

రాహుల్‌ హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీషీటర్‌ కోగంటి సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల కాల్‌డేటా విశ్లేషణ, బాధిత కుటుంబసభ్యులను విచారించగా తెలిసిన అంశాలతో ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై మాత్రం ఇంకా విచారణ కొనసాగుతోంది.

మృతదేహం తరలింపు

రాహుల్ మృతదేహానికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని రాహుల్ స్వగ్రామమైన ప్రకాశం జిల్లా ఒంగోలుకు తరలించారు. రాహుల్‌ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి

murder in vijayawada : విజయవాడలో వ్యాపారవేత్త హత్య

Last Updated : Aug 20, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details