ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dead body in Car case: రాహుల్ హత్య కేసు.. బెంగళూరులో చిక్కిన మరో నిందితుడు - Rahul murder case latest news

Rahul murder accused Koganti Satyam arrested
రాహుల్ హత్య కేసు నిందితుడు కోగంటి సత్యం అరెస్ట్

By

Published : Aug 23, 2021, 8:59 PM IST

Updated : Aug 24, 2021, 6:27 AM IST

20:57 August 23

పోలీసుల అదుపులో రాహుల్‌ హత్య కేసు నిందితుడు కోగంటి సత్యం

పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసులో కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యం బెంగళూరు వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక కోరాడ విజయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు రాహుల్ హత్య విషయంలో కోగంటి సత్యం పాత్ర ఏంటన్న విషయంపై కూపీ లాగారు.

విజయవాడ వ్యాపారి రాహుల్‌ హత్యకేసులో నిందితుడు, రౌడీషీటర్‌ కోగంటి సత్యంను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నగరం విడిచి వెళ్లకుండా పిలిచినప్పుడు విచారణకు రావాలంటూ.... సత్యంకు ముందే సమాచారం ఇచ్చారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. అయినా సత్యం పోలీసుల కళ్లుగప్పి కె.ఎస్.నారాయణ అనే పేరుతో టికెట్‌ బుక్‌ చేసుకుని. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు విమానం ఎక్కి వెళ్లిపోయాడు. పోలీసులు సమాచారం తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకునే సరికి విమానం టేకాఫ్‌ అయింది. వెంటనే బెంగళూరు విమానాశ్రయం పోలీసులకు సమాచారమివ్వగా వారు సత్యంను అక్కడే అదుపులోకి తీసుకున్నారు.

విజయ్‌కుమార్, రాహుల్‌ మధ్య.. కంపెనీ సంబంధిత వివాదాలే రాహుల్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితురాలిగా ఉన్న గాయత్రి తన కుమార్తెకు ఎయిమ్స్‌లో సీటు ఇప్పించాలంటూ రాహుల్‌కు 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. మెడికల్‌ సీటు ఇప్పించకపోవడం వల్ల.. కనీసం డబ్బు అయినా తిరిగి ఇవ్వమని గాయత్రి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఇటీవల ఒంగోలు కూడా వెళ్లి నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత రాహుల్ 6 కోట్ల రూపాయల్లో 50 లక్షలు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయంపై మాట్లాడేందుకు హత్య జరిగిన రోజు రాహుల్‌ను పిలిపించారు. కారులో వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు..... డబ్బు ఇవ్వకపోవడం వల్లే హత్య చేసినట్లు భావిస్తున్నారు.

చిట్‌ఫండ్స్‌ వ్యాపారంలో విజయకుమార్‌కు గాయత్రి భాగస్వామిగా ఉన్నారు. అందువల్ల రాహుల్ హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటన్న విషయంపై  విజయ్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఇప్పటికే రాహుల్‌ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉందని భావిస్తున్న దాదాపు 15 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేసు చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు.

అనుబంధ కథనాలు:

Rahul Murder Case: రాహుల్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

Last Updated : Aug 24, 2021, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details