ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నియంత్రణలో ఏపీ నెంబర్ వన్​: మంత్రి కొడాలి నాని - ఏపీలో కరోనా ఎఫెక్ట్ న్యూస్

కరోనా నియంత్రణలో దేశంలోనే తొలిస్థానంలో ఏపీ ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం నిత్యం సమీక్ష చేస్తూ.. పరిస్థితి తెలుసుకుంటున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకే జోన్ల పద్ధతి తీసుకు వచ్చినట్లు చెప్పారు.

kodali nani on corona virus
kodali nani on corona virus

By

Published : Apr 13, 2020, 6:59 PM IST

కేంద్రమంత్రి పాసవాన్‌ అన్ని రాష్ట్రాలతో మాట్లాడారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రస్తుతం 45 వేల బేళ్ల గోనె సంచులు కావాలన్నారు. మార్చి 29 నుంచి నేటి వరకు కోటి 35 లక్షల మంది రేషన్ తీసుకున్నారన్న కొడాలి నాని.. రద్దీ నియంత్రణ కోసమే కూపన్ల విధానం ప్రవేశపెట్టామని వివరించారు. పీడీఎస్‌కు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉంటుందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details