వివరాలు చెబుతున్న సీఐ
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలనుకున్నారు..! - online frauds in ap news
అప్పుల బాధ తాళలేక కిడ్నీలను అమ్ముకుని... వాటిని తీర్చేద్దామనుకున్నారు. అందుకోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయించారు. ఒక్కో కిడ్నీకి రూ.2కోట్లు ఇస్తామని నమ్మబలికిన నేరగాళ్లు... వివిధ ఖర్చుల పేరిట వీరి వద్దే 16.61 లక్షలకుపైగా దండుకున్నారు. మరో 5 లక్షలు కావాలని అడగడటంతో బ్యాంకును సంప్రదించగా... నకిలీ అని తేలింది. తాము మోసపోయామని గ్రహించిన కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన భార్గవి, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలనుకున్నారు..! Kidneys wanted to sell to pay off debts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8790912-489-8790912-1600033017281.jpg)
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలనుకున్నారు..!