ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kidney Disease Deaths: ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలైనా తగ్గని వ్యాధి.. అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి - Dialysis in govt hospitals

Kidney Problems: అక్కడి గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారే కనిపిస్తారు. కిడ్నీ వ్యాధులతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ కిడ్నీ వ్యాధి కారణంగా అనేక కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోయాయి. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లోని పరిస్థితి ఇది.

Kidney Disease Deaths
కలవరపెడుతున్న కిడ్నీ వ్యాధులు...దక్కని ప్రాణాలు...

By

Published : Mar 2, 2022, 11:54 AM IST

కలవరపెడుతున్న కిడ్నీ వ్యాధులు...దక్కని ప్రాణాలు..

Kidney Disease Deaths: అక్కడి గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నవారే కనిపిస్తారు. కిడ్నీ వ్యాధులతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ కిడ్నీ వ్యాధి కారణంగా అనేక కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోయాయి. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లోని పరిస్థితి ఇది.

కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలోని చైతన్యనగర్, దీప్లానగర్, చీమలపాడు, పెద్దతండా, మాన్‌సింగ్‌ తండా, రేపూడితండా, కంభంపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాలు...కిడ్నీ వ్యాధి బాధితులకు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇక్కడ కిడ్నీ బాధితులు వందల్లో ఉన్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఎ.కొండూరు మండలంలో 20మంది ప్రస్తుతం డయాలసిస్‌ చేయించుకుంటున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. మందులు వాడుతున్న బాధితుల్లో చాలామందికి డయాలసిస్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నా, ఆర్థిక పరిస్థితి సహకరించక, ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్‌ చేయించుకున్న వారు సైతం మృతి చెందటంతో గ్రామస్తులు భయపడుతున్నారు.

ఇదీ చదవండి :Inter Exams in ap: ఇంటర్‌ పరీక్షలు వాయిదా..?

"మా నాన్న 30నవంబర్ 2021 నాడు చనిపోయారు. ఆయను కిడ్నీ వ్యాధని సంవత్సన్నర క్రితమే తెలిసింది. బలహీనంగా ఉండటంతో డాక్టర్లు డయాలసిస్ వద్దన్నారు. మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. " -విజయకుమార్‌, జరబల రాంబాబు కుమారుడు

"మా అమ్మగారికి కిడ్నీ జబ్బు చేయడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించాము. నెలకు 15 నుంచి 20వేల రూపాయలు వైద్యానికి ఖర్చయ్యింది. ఉన్న పొలాన్ని అమ్మి మరీ 2సంవత్సరాల పాటు చికిత్స అందించినా ఆమె మాకు దక్కలేదు. " -జమలయ్యనాయక్‌, గుగ్గులోతు గుండమ్మ కుమారుడు

Kidney Problems: చీమలపాడుకు చెందిన 49ఏళ్ల రాంబాబు, పెదతండాకు చెందిన 45 ఏళ్ల గుండమ్మ, మాన్‌సింగ్‌ తండాకు చెందిన 58 ఏళ్ల భరోతు సక్రు, దీప్లానగర్‌ తండా వాసి భరోతు బాలి కిడ్నీ వ్యాధికి చికిత్స కోసం లక్షలు ఖర్చు చేశారు. డయాలిసిస్‌ చేయించుకుంటూనే ప్రాణాలు కోల్పోయారు. దాంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.

"ఏడెనిమిది సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉండేవారు. అలాంటి సమయంలో కూడా ఒక్కరూ కూడా మాకు సాయం అందించలేదు.కనీసం ప్రభుత్వం నుంచి ఫించను సాయం కూడా అందలేదు. ఎంతమంది దగ్గర మొరపెట్టుకున్నా...మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. " -రమేష్‌, భరోతు సక్రు కుమారుడు

"ఆయనకు కిడ్నీ సమస్యని తెలిసి బతుకుతాడనే ఆశతో ప్రైవేటు వైద్యమే అందించాం. 5లక్షల రూపాయల వరకూ ఖర్చు అయ్యింది. తరువాత మాకు చేతకాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించాం. ఆ తరువాత 9నెలలకే మరణించారు. చనిపోయి కూడా 9నెలలు అవుతోంది. " -లక్ష్మి, రాంబాబు భార్య

ఎ.కొండూరు మండలంలోని అనేక గ్రామాల్లోని తాగునీటిలో ఫ్లోరైడ్, సిలికాన్‌ అధికంగా ఉండడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కృష్ణా జలాలను ఈ గ్రామాలకు అందుబాటులోకి తెచ్చేందుకు చాలా ఏళ్ల కిందటే అధికారులు నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరుకు పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా అమలుకు నోచుకోలేదు. మరోవైపు ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుదప గ్రామం వద్ద కొత్త ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా పనులు ప్రారంభం కాలేదు.

ఇదీ చదవండి :

Funds For Navaratnalu: నవరత్నాలకే అధిక నిధులు?.. భారీగా పెరుగుతున్న అప్పు

ABOUT THE AUTHOR

...view details