ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​తో కియా ఇండియా నూతన ఎండీ మర్యాదపూర్వక భేటీ - జగన్​తో కియా ఇండియా నూతన ఎండీ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌..తన బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా (Kia india new MD meet cm jagan) కలిశారు. కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిందన్న కియా యాజమాన్యం..ఈ మేరకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలియజేసింది.

సీఎం జగన్​తో కియా ఇండియా నూతన ఎండీ మర్యాదపూర్వక భేటీ
సీఎం జగన్​తో కియా ఇండియా నూతన ఎండీ మర్యాదపూర్వక భేటీ

By

Published : Nov 16, 2021, 6:25 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ (Kia india new MD meet cm jagan) మర్యాదపూర్వకంగా కలిశారు. కియా ప్రతినిధుల బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిందన్న కియా యాజమాన్యం.. ఈ మేరకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న సామర్థ్యానికి మించి కార్లను ఉత్పత్తి చేయటంతో పాటు మార్కెటింగ్ చేయగలిగామని సీఎంకు తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్​ని సన్మానించిన జగన్..ఆయనకు జ్ఞాపికను అందజేశారు.

కార్యక్రమంలో కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కబ్‌ డాంగ్‌ లీ, లీగల్, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెవోడీలు జూడ్‌ లీ, యాంగ్‌ గిల్‌ మా, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ టి. సోమశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details