మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. విజయవాడ రోడ్ షోలో చంద్రబాబుతోపాటు కేశినేని శ్వేత పాల్గొన్నారు. పశ్చిమలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెలంపల్లి నగరానికి ఏం చేశారని ఆమె నిలదీశారు. కార్పొరేటర్ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నారని శ్వేత విమర్శించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న తెదేపా అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతంపై కక్షతోనే రాజధానిని తరలిస్తున్నారని పేర్కొన్నారు.
కార్పొరేటర్‌గా పనికిరాని వ్యక్తి మంత్రి: కేశినేని శ్వేత - మంత్రి వెల్లంపల్లిపై కేశినేని శ్వేత కామెంట్స్
రెండేళ్లుగా ఎన్నో దుర్మార్గాలు భరిస్తున్నామని తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ఆక్షేపించారు. తెదేపా పుట్టినింటి గడ్డ విజయవాడని ఆమె అన్నారు.
కార్పొరేటర్‌గా పనికిరాని వ్యక్తి ఇక్కడ మంత్రి: కేశినేని శ్వేత