ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రశ్నిస్తారనే తెదేపా నేతలను అరెస్ట్ చేస్తున్నారు' - కేశినేని శ్వేత కాగడాల ర్యాలీ

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తారనే భయంతోనే వైకాపా ప్రభుత్వం తెదేపా నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేశినేని శ్వేత అన్నారు.

Kesineni Swetha candle rally
కేశినేని శ్వేత కాగడాల నిరసన

By

Published : Jun 16, 2020, 12:03 AM IST

తెదేపా నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ... విజయవాడ కేశినేని భవన్ వద్ద కేశినేని శ్వేత ఆధ్వర్యంలో కాగడాలతో నిరసనకు దిగారు మహిళలు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే భయంతోనే వైకాపా ప్రభుత్వం తెదేపా నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేశినేని శ్వేత అన్నారు.

ఏడాది పాలనలో వైకాపా నేతలు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని... సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారి తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అన్యాయంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అక్రమ‌ అరెస్టులు, కేసుల ద్వారా తెదేపా పోరాటాన్ని ఆపలేరన్నారు.

ABOUT THE AUTHOR

...view details