ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన చాలా గొప్పది: కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ - నూజివీడులో ఆర్బీకేను పరిశీలించిన కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్ తాజా వార్తలు

పంటల సాగుకు అవసరమైన అన్ని సేవలను.. రైతులకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం వ్యవస్థ ఏర్పాటు ఆలోచన ఎంతో గొప్పదని.. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి బృందం పరిశీలించింది. రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కేరళలో ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు.

kerala agriculture minister prasad visits rythu bharosa kendram in nuzivedu at krishna district
రైతు భరోసా కేంద్రాల ఆలోచన చాలా గొప్పది

By

Published : Oct 17, 2021, 7:37 PM IST

వ్యవసాయ రంగాని(agriculture sector)కి ఇస్తున్న ప్రాధాన్యతకు.. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్(andhra pradesh) వైపే చూస్తోందని.. కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్(kerala agriculture minister prasad) అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో రైతు భరోసా(rythu bharosa kendram (rbk)) కేంద్రాన్ని.. మంత్రి ప్రసాద్ బృందం పరిశీలించింది. పంటల సాగుకు అవసరమైన అన్ని సేవలను.. రైతులకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం వ్యవస్థ ఏర్పాటు ఆలోచన ఎంతో గొప్పదని ఆయన అన్నారు.

రాష్ట్ర సహకారాన్ని కోరతాం

ఏపీలో రైతులకు విత్తనాల పంపిణీ నుంచి.. పంటకు గిట్టుబాటు ధరల వరకు అన్ని సేవలు అందించేందుకు ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, తదితర అంశాలపై తమ బృందం అధ్యయనం చేస్తుందని కేరళ మంత్రి ప్రసాద్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కేరళలో ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఆరోగ్యకరమైన వరి వంగడాల ఉత్పత్తికి.. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం ప్రోత్సహించడం కూడా పరిశీలించి, కేరళలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

పీపీటీ ద్వారా కేరళ బృందానికి వివరణ

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్డర్ చేసేందుకు.. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్​ను.. కేరళ బృందం ప్రత్యేకంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాభివృద్దికి తీసుకుంటున్న చర్యలను గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ PPT) ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ శ్రీధర్.. కేరళ బృందానికి వివరించారు.


రైతులకు సరైన సమాచారం అందక గతంలో సరైన సాగు మెళకువలు తెలియక నష్టపోయారని, వాటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయిలో 155251 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన విరవించారు. ప్రత్యేక యూ ట్యూబ్ ఛానల్ ద్వారా.. 8 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పనిచేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ విజయానంద్, కేరళ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సుభాష్, అగ్రికల్చర్ ప్లానింగ్ బోర్డు సభ్యులు , ఉపసంచాలకులు, కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:PETROL : పెట్రోల్ కల్తీ... వినియోగదారుల ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details