కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం జగన్ను కలిసిన ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు, కార్మిక సంఘాల నేతలు చెక్కులను అందజేశారు.
కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు - cm reliefe fund donations latest news
కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సంస్థలు, పలువురు వ్యాపారస్థులు అండగా నిలుస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తూ తమవంతు సాయం అందిస్తున్నారు.
![కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7540009-228-7540009-1591694067153.jpg)
కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు
సీఎం సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాపారవేత్తలు, స్వచ్ఛందసంస్థలు, వైకాపా నేతలు, కార్యకర్తలు కలసి రూ.64.50 లక్షలు విరాళం అందించారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణ రెడ్డి, ఎంపీ బాలశౌరి చెక్కులను సీఎంకు అందించారు.