కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ముందుకి వెళుతున్న వల్లూరి రవీంద్ర, వల్లూరి అశోక్ బాబును.... విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని అభినందించారు. బృందావన్ కాలనీలోని ఫకీర్ గూడెంలో కరోనా బారిన పడి, అసువులు బాసిన 8 పేద కుటుంబాలకు తమవంతు సాయంగా ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలను.. ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా సాయం అందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అశోక్ బాబు తెలియజేశారు. ఆర్థిక సహాయం పొందినవారు.... కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలపై సంతోషం వ్యక్తం చేశారు.
కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం: ఎంపీ కేశినేని - ఎంపీ కేశినేని నాని వార్తలు
ఎంత కూడబెట్టామని చెప్పుకోవడం కన్నా.... సంపాదించిన దానిలో తోచినంత నలుగురికి సహాయం చేయడమే మిన్న అంటున్నారు.... విజయవాడకి చెందిన వల్లూరి వారి కుటుంబ సభ్యులు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యతగా చెబుతున్నారు.
కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలు