ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళల రక్షణ కోసం కృషి చేస్తా: కేశినేని శ్వేత - విజయవాడలో తెదేపా నేతల మున్సిపల్​ ఎన్నికల ప్రచారం

విజయవాడ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని తెదేపా మేయర్​ అభ్యర్థిని కేశినేని శ్వేత తెలిపారు. కార్పొరేషన్​ పరిధిలోని సమస్యలను పరిష్కరించటంతో పాటు.. మహిళా రక్షణ కోసం కృషి చేస్తానని వెల్లడించారు.

kasineni swetha
మహిళా రక్షణ కోసం కృషి చేస్తా

By

Published : Mar 8, 2021, 2:49 PM IST

మహిళా రక్షణ కోసం కృషి చేస్తా

విజయవాడలో మహిళల రక్షణ కోసం కృషి చేస్తానని తెదేపా మేయర్‌ అభ్యర్థిని కేశినేని శ్వేత హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావటంతో.. పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను గుర్తించి నగరంలోని.. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రకటించారు. మేయర్‌గా అధికారం చేపడితే తిరిగి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తానని చెప్పారు.

ఈ ప్రాంతంలోని మరో డివిజన్​లో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు ప్రచారం చేశారు. డివిజన్​లో ప్రధానంగా నాలుగు సమస్యలు ఉన్నాయని.. ఆ సమస్యల పరిష్కారానికి గెలిచినా, ఓడినా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ..బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details