కార్తిక పౌర్ణమి భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలాచరించారు. 365 వత్తులతో దీపాన్ని వెలిగించి.. నదిలో విడిచిపెట్టారు. విజయవాడలోని ఘాట్‌ల వద్దకు భక్తులను అనుమతించలేదు. అయినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున రావటంతో.. ఆంక్షలతో నదీ స్నానానికి అనుమతించారు.
విజయవాడ కనకదుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి, ఆలయ సిబ్బంది నిర్వహించారు. కార్తిక పౌర్ణమి, సోమవారం ఉదయం ఆరు గంటలకు ఈ గిరి ప్రదక్షణ ప్రారంభించారు. పాలకమండలి సభ్యులు, ఆలయ ఈవో సురేష్‌బాబు సతీసమేతంగా ఈ గిరి ప్రదక్షణను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రచార రథంలో ఉంచి.. మేళ తాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య గిరిప్రదక్షణ జరిగింది.