అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న 70 కేసులను, వాటిని తరలించడానికి ఉపయోగించిన 3 విలువైన కార్లను సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం'
నగరంలోని తేనెబండ, రాజీవ్ నగర్లో కొందరు వ్యక్తులు.. కర్ణాటక మద్యం కేసులను వాహనాల నుంచి దింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక జ్యోతీశ్వరన్తో పాటు మదనపల్లి పట్టణానికి చెందిన చామంచి మల్లికార్జున, కోలారుకు చెందిన మోహన్, ఐరాల మండలం నాంపల్లికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.