కనుమ పండుగ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా గోపూజలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గోపూజలు జరిపారు. గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయ ఆవరణలో.. గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో కనుమ వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠం ప్రాంగణంలోని గోమాతలకు పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు గోపూజ నిర్వహించారు. విశాఖ సింహాచలంలో.. గోపూజ వైభవంగా జరిగింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. కృష్ణాపురంలో గోవులను సంప్రదాయబద్ధంగా పూజించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలోనూ గోవులకు పూజలు నిర్వహించారు.