అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెదేపా ఎందుకు అడ్డుకుందని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. శాసనసభ నిబంధనలకు అనుగుణంగానే బిల్లులు రూపొందాయని పేర్కొన్నారు. లేనిపోని సెక్షన్లతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రతీసారీ తెదేపా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ.. మళ్లీ.. వాటిపై ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం తెదేపా ఎందుకు చేస్తోందో చెప్పాలని కన్నబాబు అడిగారు.
అధికారంలో తాము ఉంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయని యనమల భ్రమ పడుతున్నారు. 5 ఏళ్లల్లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఏం అభివృద్ధి చేసింది. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామనంటే తెదేపా ఎందుకు అడ్డుకుంటోంది చెప్పాలి. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, ఎలాంటి అనుమానాల్లేవు. విశాఖ అభివృద్ధి తెదేపాకు అవసరం లేదా?. రాష్ట్రంలో ప్రజలు వికేంద్రీకరణనే కోరుకుంటున్నారు.