ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kandikonda Funeral: నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు - నేడు స్వగ్రామం నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు

Kandikonda Funerals: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు ఇవాళ ఉదయం జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని నాగుర్లపల్లిలో.. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

kandikonda funerals to be conduct at nagurlapalli in warangal district
నేడు స్వగ్రామం నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు

By

Published : Mar 14, 2022, 7:12 AM IST

Kandikonda Funerals: తెలంగాణలో అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ గేయరచయిత కందికొండ అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కందికొండ పార్ధివదేహం నివాసానికి చేరుకోగా.. ఒక్కసారిగా బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. హితులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

కందికొండ అమర్ రహే అంటూ నినదిస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి కందికొండకు ఘనంగా నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వశక్తితో ఎదిగి తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే విధంగా అనేక పాటలు రాసి...పేరు ప్రఖ్యాతలు పొందారని కొనియాడారు. కందికొండ అకాలం మరణం అందరికీ తీరని లోటని.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details