ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు.... కుట్ర కాదా ?' - అచ్చెన్నాయుడు అరెస్టు న్యూస్

ప్రభుత్వ అక్రమాలపై అచ్చెన్నాయుడి పోరాటాన్ని అణగదొక్కేందుకు కుట్రపూరితంగా అరెస్టు చేశారని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయన అన్నారు.

'ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటం కుట్ర కాదా ?'
'ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటం కుట్ర కాదా ?'

By

Published : Jun 12, 2020, 1:17 PM IST

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై పోలీసులు ప్రవర్తించిన తీరు సరి కాదని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేతిరాతతో రాసిన నోట్‌తో అరెస్టు కుట్రకాదా ? అని నిలదీశారు. ప్రభుత్వ అక్రమాలపై అచ్చెన్నాయుడి పోరాటాన్ని అణగదొక్కేందుకు కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని కనకమేడల మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details