ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kanakamedala: భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం: కనకమేడల

నారా లోకేశ్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సరికావని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం
భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం

By

Published : Nov 14, 2021, 4:29 PM IST

భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం

సంస్కారవంతమైన భాష గురించి వైకాపా నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. నారా లోకేశ్ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మాట్లాడటం చూస్తే అలాగే అనిపిస్తోందని విమర్శించారు. భాష, నాగరికతల గురించి మాట్లాడే హక్కు విజయసాయిరెడ్డికి, వైకాపా నేతలకు లేదన్నారు. సూటుకేసులు తరలించే అలవాటు తెదేపాకు లేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details