ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కుట్రలో భాగంగానే తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రత్యర్థులను రాజకీయ శత్రువులుగా మార్చారని ఆక్షేపించారు. చంద్రబాబుపై హత్యాయత్నం జరిగినా ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులను నిలదీశారు. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలను ఎందుకు పరిశీలించట్లేదని ప్రశ్నించారు.
Kanakamedala: జగన్ సీఎం అయిన తర్వాత విపక్ష నేతలపై కేసులు: కనకమేడల
జగన్ సీఎం అయిన తర్వాత విపక్ష నేతలపై కేసులు
18:32 September 17
జగన్ సీఎం అయిన తర్వాత విపక్ష నేతలపై కేసులు
"సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థులను రాజకీయ శత్రువులుగా మార్చారు. రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయాలనే కుట్ర పన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి వైకాపా కుట్రలో భాగమే. చంద్రబాబుపై హత్యాయత్నం జరిగినా కేసు లేదు. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలను ఎందుకు పరిశీలించరు ?" - కనకమేడల, తెదేపా ఎంపీ
ఇదీ చదవండి
CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
Last Updated : Sep 17, 2021, 7:18 PM IST