ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వంలో రైతులు నష్టపోవటం పరిపాటిగా మారింది'

వైకాపా ప్రభుత్వంలో ఏటా రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లాలో రైతులకు హక్కుగా రావాల్సిన సొమ్మును కూడా చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కాల్వ శ్రీనివాసులు
కాల్వ శ్రీనివాసులు

By

Published : May 26, 2021, 10:42 PM IST

వైకాపా ప్రభుత్వంలో ఏటా రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.

"అనంతపురం జిల్లాలో రైతులకు హక్కుగా రావల్సిన సొమ్ము కూడా చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్​లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటనష్టంపై తెదేపా ముందు నుంచి హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో 30 మండలాల రైతులు ఇన్​పుల్ సబ్సిడీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున ఇన్​పుట్ సబ్సిడీ అందించాలి. గత ఏడాది ఖరీఫ్​లో పంటలు నష్టపోయిన వేరుశనగ రైతులకు పంటల బీమా పరిహారంలో తీరని అన్యాయం జరిగింది. జిల్లాలో 2.29 లక్షల మంది రైతులు 7.92 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే కేవలం రూ. 212 కోట్లు విడుదల కావటం బాధాకరం. నివర్ తుపాన్ దాటికి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే కేవలం రూ.38 కోట్లు విడుదల చేశారు. రైతులకు రావాల్సిన రాయితీలకు ఎగ్గొట్టాలనే ప్రభుత్వం చూస్తోంది తప్ప అన్నదాతలకు ఆదుకోవట్లేదు" అని తెలిపారు.

ఇదీ చదవండి:

జూన్ 1 నుంచి.. తిరుమల - అలిపిరి నడక మార్గం మూసివేత!

ABOUT THE AUTHOR

...view details