తప్పుడు కేసులతో తమను దొంగల ముఠా భయపెట్టలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా కార్యకర్త మారుతిపై జరిగిన దాడిని లోకేశ్ ఖండిస్తే, ఆయనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించడం వైకాపా నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
'కార్యకర్తపై దాడిని ఖండిస్తే.. లోకేశ్‌పై కేసు పెట్టడమేంటి?' - kalva srinivasulu on nara lokesh case news
వైకాపా బనాయించే అక్రమ కేసులకు భయపడేది లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
kalva srinivasulu
డి.హీరేహాళ్ మండలంలో వైకాపా నాయకుల దోపిడీని త్వరలోనే ప్రజలముందు పెడతామని ఆయన చెప్పారు. తప్పుడు కేసులను తిప్పికొడుతూనే దొంగల ముఠా అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అనంతపురంలో నారా లోకేశ్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?