ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya sai Reddy) దోపిడీకి వైకాపా నేతలు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) విమర్శించారు. దోచుకునేందుకే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పాగా వేశారని ధ్వజమెత్తారు. దోపిడీలో విజయసాయికి నమ్మిన బంటుగా అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) పనిచేస్తున్నారని ఆక్షేపిచారు. రాష్ట్ర మంత్రులు (State Ministers) అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల కుంభకోణానికి (Scam) తెరలేపారని ఆరోపించారు.
దోపిడీలు చేసే వైకాపా నేతలా ప్రజల తలరాతలు మార్చేదని దుయ్యబట్టారు. దుర్మార్గాలు కొనసాగనిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అసమర్థ పాలన, అవినీతితో రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కాలవ ధ్వజమెత్తారు.