నవరత్నాల అమలు పేరుతో ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారని కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలంతా పేదల వ్యతిరేకులేనని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'పేదల సంక్షేమానికి బాటలు వేస్తే ఆంధ్రప్రదేశ్‌లో బతకలేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు. 2014లో తెదేపా అధికారం చేపట్టేనాటికి 34లక్షల మందికి ఫించన్ అందుతుంటే, ఆ సంఖ్యను 54 లక్షలకు పెంచాం. 20 నెలల్లో పింఛన్ తీసుకునే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రూ.200 ఫించన్‌ను తెదేపా రూ.2వేలు చేసింది. రూ.3వేలు ఫించన్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ కేవలం రూ.250మాత్రమే పెంచి పథకం అమలును ప్రహసనంగా మార్చారు.' అని కాలవ విమర్శించారు.