విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కలశజ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. సత్యనారాయణపురంలోని శివరామనామ క్షేత్రం నుంచి ప్రారంభమై, ఈ కలశ జ్యోతి అమ్మవారికి గుడికి చేరుకుంటుందన్నారు. భక్తులు కలశజ్యోతులతో .. గాంధీనగర్ రోడ్, రథం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ చేరుకుంటారు. అమ్మవారికి కలశజ్యోతులు సమర్పించే ప్రతి ఒక్కరు.. వ్యక్తిగత భద్రతతో కోవిడ్ నింబంధనలు పాటించాలన్నారు.
ఇంద్రకీలాద్రిలో కలశజ్యోతుల ఉత్సవం - విజయవాడలో కలశజ్యోతుల ఉత్సవం
విజయవాడలోని కనకదుర్గాదేవి ఆలయ ఆధ్వర్యంలో.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కలశజ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. అమ్మవారికి కలశజ్యోతులు సమర్పించే ప్రతి ఒక్కరు.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
ఇంద్రకీలాద్రిలో కలశజ్యోతుల ఉత్సవం