వరద ప్రభావిత ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం డ్రోన్లతో ఎందుకు చిత్రీకరించడం లేదని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిన డ్రోన్లు చంద్రబాబు నివాసం పైనే పని చేస్తాయా అని నిలదీశారు. కృష్ణా వరదలపై సమీక్ష కానీ, ఏరియల్ సర్వే కానీ చేయని సీఎం రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లారని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయం పక్కన పెట్టి వరద సహయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. వరద ప్రభావిత ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, వరదల్లో బాధితుల ఇబ్బందులు ప్రభుత్వానికి కన్పించవా అని కళా వెంకట్రావు మండిపడ్డారు.
'డ్రోన్లు చంద్రబాబుపై నిఘాకు కాదు.... ప్రజల కోసం వాడండి'
డ్రోన్లు చంద్రబాబుపై నిఘాకు కాకుండా... వరదల్లో ప్రజల కష్టాలు చిత్రీకరించడానికి వాడాలని కళా వెంకట్రావు వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కళావెంకట్రావు