ఉచిత ఇసుకను రద్దు చేసి లోపభూయిష్టమైన వ్యవస్థను తెచ్చారని కళా వెంకట్రావు విమర్శించారు. వేలల్లో చెల్లించినా సరైన ఇసుక అందుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇసుక రీచుల కేటాయింపులో గొడవకు దిగారని ఆరోపించారు. గ్రానైట్ వ్యాపారాలు ఉన్న ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కళా తెలిపారు. రూ.కోట్లలో జరిమానాలు విధించి ఆ వ్యాపారాలను వైకాపా నేతలే హస్తగతం చేసుకుంటున్నారని విమర్శించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ అధికమైంది: కళా - జగన్పై కళా వెంకట్రావు కామెంట్స్ న్యూస్
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, గ్రానైట్, మట్టి, గ్రావెల్ అక్రమ మైనింగ్, అమ్మకాలు అధికమయ్యాయని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ దందా మొత్తం అధికార పార్టీలోని కొందరు పెద్దలు దగ్గరుండి చేస్తున్నారని ఆరోపించారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ అధికమైంది: కళా
TAGGED:
ఏపీలో అక్రమ మైనింగ్ వార్తలు