రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు కేంద్రం మెడలు వంచారో ప్రజలకు లెక్క చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. మెడలు వంచేటపుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. 10వ తరగతి కూడా పాస్ అవ్వని కొడాలి నానికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చిన జగన్... డిగ్రీ, ఎంబీఎ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ షాపుల్లో బేరర్లుగా చేశారని విమర్శించారు.
వైకాపాలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి లక్షలాది మందిని నట్టేట ముంచిన నిరుద్యోగ ద్రోహి జగన్ అని కళా వెంకట్రావు అన్నారు. రైతులు వర్షం కోసం ఎదురుచూసినట్లు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.