ద్రవ్య బిల్లును అడ్డుకున్నది మంత్రి బొత్స సత్యనారాయణననే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ద్రవ్య బిల్లును మండలిలో ప్రవేశపెట్టడానికి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిద్దమైనా...ఆయనను వెనక్కి లాగి మంత్రి బొత్స కూర్చోబెట్టారన్నారు. వైకాపా మంత్రులు ద్రవ్య బిల్లు కన్నా.. రాజధాని బిల్లుకే ప్రాధాన్యతనిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని బిల్లు కోసం ద్రవ్య బిల్లు పాస్ కాకుండా చేయటం వారి స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు.
'మంత్రులు ద్రవ్యబిల్లు కన్నా రాజధాని బిల్లుకే ప్రాధాన్యమిచ్చారు' - 'మంత్రులు ద్రవ్యబిల్లు కన్నా రాజధాని బిల్లుకే ప్రాధాన్యమిచ్చారు'
శాసనమండలిలో ఓటింగ్ అర్హత లేకున్నా.. 18 మంది మంత్రులు మండలిపై దండ యాత్ర చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. మంత్రులు ద్రవ్య బిల్లు కన్నా.. రాజధాని బిల్లుకే ప్రాధాన్యతనిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మంత్రులు ద్రవ్యబిల్లు కన్నా రాజధాని బిల్లుకే ప్రాధాన్యమిచ్చారు'
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజధాని బిల్లును కరోనా లాంటి క్లిష్టసమయాల్లో పెట్టడం ఏం సాంప్రదాయమని కళా ప్రశ్నించారు. శాసనమండలిలో ఓటింగ్ అర్హత లేకున్నా.. 18 మంది మంత్రులు మండలిపై దండ యాత్ర చేశారని ధ్వజమెత్తారు. లోకేశ్‌పై అబద్దాలు మాట్లాడి మంత్రులు తమ స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు.