Kakatiya Seva Samakhya Fire On MP Gorantla: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై కాకతీయ సేవా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయంలోకి సామాజిక వర్గాలను తీసుకొచ్చి దూషించడం తగదని సమాఖ్య సభ్యులు మండిపడ్డారు. సామాజిక సేవ చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే తమను ఇతర కులాలకు దూరం చేసే విధంగా కుట్ర చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
'మీ వ్యక్తిగత విషయాల్లోకి సామాజిక వర్గాలను తీసుకొస్తారా ?' - ఎంపీ గోరంట్ల వీడియో
Kakatiya Seva Samakhya Fire: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన వ్యక్తిగత విషయంలోకి సామాజిక వర్గాలను తీసుకొచ్చి దూషించడం తగదని కాకతీయ సేవా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఎంపీ గోరంట్లపై కాకతీయ సేవా సమాఖ్య ఫైర్
కష్టపడేతత్వం, చైతన్యం ఉన్న తమను శాశ్వతంగా వెలివేసే కుట్ర జరుగుతోందని సమాఖ్య సభ్యులు ఆరోపించారు. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా తమ పోరాటం ఉంటుందని.., ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని వెల్లడించారు. గోరంట్ల మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి