జస్టిస్ ఎన్.వి రమణ విద్యార్థి దశలోనే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టేవారని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్ధి సంఘాల్లో జస్టిస్ రమణ చురుగ్గా పనిచేశారని... సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఎప్పుడూ కాంక్షించేవారని తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదగటం గర్వకారణమన్నారు. న్యాయవ్యవస్థలో మరింత అభివృద్ధి వస్తుందని రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
గర్వంగా ఉంది