ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JUNIOR DOCTORS STRIKE IN AP : నేటి నుంచి జూనియర్ డాక్టర్ల ఆందోళన - Junior Doctors Strike in andhra pradesh

Junior Doctors Strike in AP : నేటి నుంచి జూనియర్ వైద్యులు సమ్మె చేపట్టనున్నారు. స్టైఫండ్స్ పై టీడీఎస్ కట్‌ చేయడం, నీట్ పీజీ కౌన్సెలింగ్ ను సుప్రీం కోర్టు వాయిదా వేయటానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. 5 నుంచి ఓపీ, 9 నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు.

నేటి నుంచి జూనియర్ డాక్టర్ల ఆందోళన
నేటి నుంచి జూనియర్ డాక్టర్ల ఆందోళన

By

Published : Dec 1, 2021, 4:13 AM IST

Junior Doctors Strike in AP : జూనియర్ డాక్టర్స్​కు అందించే స్టైఫండ్స్ పై టీడీఎస్ కట్‌ చేయడం, నీట్ పీజీ కౌన్సెలింగ్ ను సుప్రీం కోర్టు వాయిదా వేయటానికి వ్యతిరేకంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు జూనియర్‌ డాక్టర్లు పిలుపునిచ్చారు. పని చేసే ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. 2వ తేదీన సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్, 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖల సమర్పణ, 4న ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మాస్ మెయిలింగ్ చేపట్టనున్నట్లు జూడాలు తెలిపారు. 5 నుంచి ఓపీడీ సేవలు, 7 నుంచి ఐచ్ఛిక సేవలు, 9 నుంచి అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా స్టైఫండ్స్​లో టాక్స్ కట్ చెయ్యడాన్ని జుడాలు తీవ్రంగా వ్యతిరేకించారు. సెక్షన్ 10 (16) కింద స్టైఫండ్స్​ను స్కాలర్‌షిప్ గా పరిగణించి టాక్స్‌ కట్‌ చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము విన్నవించినప్పటికీ వాటిని పరిగణించకుండా కొన్ని కళాశాలలో టాక్స్ ని కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్‌ కౌన్సెలింగ్​ను వాయిదా వేయడం వల్ల ఈ సంవత్సరం ఒక బ్యాచ్ కొరత ఏర్పడిందని..., కొవిడ్‌ ముంచుకొస్తున్న వేళ తగిన సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో మిగతా వైద్యులపై భారం పడుతోందని వివరించారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details